Saturday, July 08, 2006

"చందమామ" జ్ఞాపకాలు

చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళి చందమామ కథల పుస్తకాలు చదవటం నాకు ఇంకా గుర్తు. రంగు రంగుల బొమ్మలతో, నీతి కథలు, దెయ్యాల కథలు భలే వుండేవి. మా పాటకు (మా అమ్మ వాళ్ళ ఊరిలో 'సందు' ని అలా పిలిచే వారు) లోకి ఎవరైనా వస్తే మా నాన్నగారి నలుగురు అన్నదమ్ముల ఇళ్ళుండేవి. మొదటగా మా ఇల్లు, తరువాత వరుసగా మిగిలిన మూడూను. నేను మా పెద్దకాకా ('కాకా' హిందీ పదం బాబాయికి, మేము అలా పిలిచే వాళ్ళం చిన్నప్పుడు) వాళ్ళ ఇంటికి వెళ్ళి చందమామ పుస్తకాలు చదివేదాన్ని. భోంచేసి వెళ్ళమని మా అమ్మ మా చెల్లిని పంపితే, ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ తిప్పిపంపే దాన్ని...ఇక దానికి విసుగొచ్చి చివరికి మా ఇంటి అరుగు మీద నుంచుని "అక్కా.. అమ్మ పిలుస్తోది" అని అరిచేది. మూడెళ్ళుండేవోమో దానికి అప్పుడు. మామూలుగా అయితే ముద్దొచ్చేది కానీ పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం వొళ్ళు మండేది :) ఒక కథ మొదలు పెడితే అసలు చందమామ పుస్తకం వదలబుద్ధి అయ్యేది కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు దేనికోసమో Google చేస్తుంటే చందమామ మీద ఒక మంచి Article చూశాను. చాలా nostalgic గా అనిపించింది. కొన్ని దశాబ్దాలుగా మన చిన్ననాటి జ్ఞాపకాలతో ఇంతగా ముడిపడిపోయిన చందమామ కథల పుస్తకాల గురించి కొంచెం మాట్లాడుకుందామా?

2 Comments:

At 2:00 AM, Blogger chandu said...

చాలా బాగుంది.
ధన్యవాదాలు....

 
At 2:27 PM, Blogger త్రివిక్రమ్ Trivikram said...

ఈరోజు నేను వేరొకందుకు వెతుకుతూ అవీ-ఇవీ అనే పేరు చూసి కుతూహలంతో ఇటొచ్చాను. ఎందుకంటే అది నా బ్లాగు పేరు మరి :) మీ "చందమామ జ్ఞాపకాలు" చాలా బాగున్నాయి. వికీపీడియా చందమామ వ్యాసంలోని సమాచారంలో ఎక్కువభాగం కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి "చందమామ జ్ఞాపకాలు" అనే వ్యాసం నుంచే తీసుకోబడింది. :)

 

Post a Comment

<< Home